
20న కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరుకావాలి
విజయనగరం క్రైమ్: ఇటీవల విడుదలైన ఫలితాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉదయం 8 గంటలకు హాజరు కావాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. అభ్యర్థులు తమ సెలక్షన్ అప్లికేషన్‌తో పాటు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన మూడుసెట్ల విద్యార్హత సర్టిఫికెట్ల జెరాక్సు కాపీలను, మూడు పాస్‌ఫొటోలు తీసుకురావాలన్నారు. జిల్లాలో నిర్వహించిన పోలీస్ ఎంపిక ప్రక్రియలో 723 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు.
ఆర్థిక ప్రోత్సాహకం
అందజేయాలని ఆదేశం
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం కింద శస్త్రచికిత్స, చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ (ఆర్థిక ప్రోత్స హకం)ను అందజేయాలని డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి ఆదేశించారు. ఏడాదిన్నర కాలంగా ఎస్.కోట ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బందికి ఆర్థిక ప్రోతాహకం అందడం లేదనే అంశంపై ఈనెల 17వ తేదీన ‘అందని ఆర్థిక ప్రోత్సాహకం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి డీసీహెచ్‌ఎస్ స్పందించారు. తక్షణమే ఇన్సెంటివ్‌ను అందజేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు.
నేటి నుంచి జిల్లాలో 150 ఆధార్ శిబిరాలు
● గ్రామ, వార్డు
సచివాలయాల ప్రత్యేకాధికారి
రోజారాణి
విజయనగరం అర్బన్: ఆధార్ నమోదు, అప్‌డేట్ కోసం జిల్లాలో 150 ఆధార్ శిబిరాలను మంగళవారం నుంచి నిర్వహిస్తామని గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేకాధికారి రోజారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూల్స్‌లో చదువుతున్న పిల్లలు తమ కోర్ బయోమెట్రిక్‌ను ఆధార్ డేటా బేస్‌లో అప్‌డేట్ చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 16 లక్షల మంది అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందన్నారు. తల్లికి వందనానికి సంబంధించి తల్లుల బ్యాంక్ అకౌంట్ల ఎన్‌పీసీఐ లింకింగ్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమ కాలేదని, అలాంటివారు పోస్టల్‌లో ఖాతాలు తెరవాలన్నారు.
ఈసీ తాటాకు చప్పుళ్లకు భయపడం
● డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్
విజయనగరం ఫోర్ట్: ఎన్నికల కమిషన్ తాటాకు చప్పళ్లకు కాంగ్రెస్ పార్టీ భయపడదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఓట్ల చోరీకి నిరసనగా విజయనగరం మూడు లాంతర్ల వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎలక్షన్ కమిషన్ బీజీపేకి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించా రు. ఎన్నికల కమిషన్ తప్పిదాలకు నైతిక బాధ్యతగా సీఈసీ జ్ఞానేశ్వర్, ఎలక్షన్ కమిషనర్లు సుఖబీర్ సింగ్ సందు, వివేక్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూడి శ్రీనివాస్, గణేష్, శ్రీనివాస్, షరీఫ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు
విజయనగరం: జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 20న జరుగుతాయని ిసీఈఓ బి.వి.సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు జెడ్పి సమావేశ మందిరంలో జరగనున్న 1–7 స్థాయీ సంఘ సమావేశాలకు సభ్యులందరూ హాజరుకావాలని కోరారు.

20న కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరుకావాలి

20న కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరుకావాలి

20న కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరుకావాలి