
అప్పీల్ పేరుతో ఇబ్బందులా?
విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పింఛన్లు అరికట్టేందుకు జరిపిన పునఃపరిశీలనలో భాగంగా చాలామంది అర్హులను కూడా తొలగించడం అన్యాయమని, దీనిని సరిచేయాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్‌కు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం వినతిపత్రం అందజేశారు. మంచంపైనుంచి కదల్లేని దివ్యాంగులు ఆస్పత్రులకు వెళ్లి మాన్యువల్ సర్టిఫికెట్ తీసుకోవడం, దానిని 30 రోజుల్లోగా ఎంపీడీఓకు అందజేయడమంటే సాధ్యంకాని పని అన్నారు. అర్హుల పింఛన్ రద్దయితే వారి బతుకు ఛిద్రంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు.