
వ్యవసాయంలో మేము సైతం..
మన్యంలోని వ్యవసాయం సాగులో మేము సైతం అంటూ చిన్నారులు తల్లిదండ్రులకు తోడుగా నిలబడుతున్నారనేందుకు ఈ చిత్రం సజీవ సాక్ష్యం. తండ్రికి తోడుగా తనయులు అన్నట్టు ఖరీఫ్ సీజన్‌లో ఇటీవల వర్షాలు విస్తారంగా ఏజెన్సీలో కురుస్తుండడంతో ఉభాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సాగులో పైపులు వేయడం ద్వారా నీటిని పొలాల్లో నిల్వ చేస్తారు. ఈ క్రమంలో రాయిలంకకు చెందిన ఇద్దరు చిన్నారులు తండ్రిగా సాయంగా పైపులు సుదూరంలో ఉండడంతో వాటిని పొలానికి మోసుకుంటూ ఇలా తీసుకువెళ్తూ... ఆదివారం సాక్షి కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు సాగులో తండ్రికి సాయం చేస్తూ.. ఇలా నిలిచారు. – సీతంపేట