
సంగమేశ్వరస్వామి ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు
వంగర: హైకోర్టు జడ్జి గేదెల తుహిన్‌కుమార్‌కు వంగర మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సంగాంలో వెలసిన సంగమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఆదివారం వచ్చారు. తొలుత వంగర విచ్చేసిన ఆయనకు ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సంగమేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని ప్రధానార్చకులు సిద్దాంతం గణపతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజాం సీనియర్ సివిల్ జడ్జి కె.శారదాంబ, పలువురు మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, దేవదాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.