
శ్రీకృష్ణాష్టమి పూజలు
విజయనగరం: శ్రీకృష్ణుని చల్లని దీవెనెలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషా లు, ఆయురారోగ్యాలతో ఆనందమయమైన జీవితాన్ని సాగించాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ధర్మపురి లో శనివారం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ రాధాకృష్ణలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. కార్యక్రమంలో కుటుంబసభ్యులు మజ్జి పుష్పాంజలి, సిరిసహస్ర, బడ్డుకొండ ప్రదీప్‌నాయుడు, భక్తులు పాల్గొన్నారు.
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టుకు నీటితాకిడి పెరిగింది. ప్రాజెక్టు లో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 7వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. 64.52 మీటర్ల మేర నీటిమట్టం నమోదైందని ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టులోకి వచ్చిన 7 వేల క్యూసెక్కు ల నీటిని రెండు గేట్లు ఎత్తి నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నామన్నారు.
భోగాపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అధికారుల హెచ్చరికలతో భోగాపు రం మండలంలోని సముద్రతీర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా చేపలవేటను మత్స్యకారు లు నిలిపివేశారు. ముక్కాం, చేపలకంచేరు, కొండ్రాజుపాలెం తదితర సముద్రతీర ప్రాంతా ల మత్య్సకారులు తమ పడవలు, వలలను భద్రపరిచి విశ్రాంతి తీసుకుంటున్నారు.
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం స్థానిక పెన్షన్ సంఘం కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగింది. తొలుత అసోసియేషన్ జండాను ఆవిష్కరించా రు. జిల్లా అధ్యక్షుడు రామచంద్రపండ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూపీ హైకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ విద్యాసాగర్, ప్రత్యేక అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి ఎల్.వి.యుగంధర్, రాష్ట్ర కోశాధికారి సొంటి కామేశ్వ రరావు, జిల్లా కార్యదర్శి బి.బాలభాస్కర్, జి ల్లా కోశాధికారి వై.శంకరరావు, ఆదినారాయ ణ, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకృష్ణాష్టమి పూజలు

శ్రీకృష్ణాష్టమి పూజలు

శ్రీకృష్ణాష్టమి పూజలు