
హైకోర్టు జడ్జి ఇంట సందడి
వీరఘట్టం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గేదెల తుహిన్‌కుమార్ ఇంట వద్ద శనివారం సందడి నెలకొంది. ఆయన హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన స్వగ్రామమైన వీరఘట్టం మండల కత్తులకవిటి గ్రామానికి వచ్చారు. దీంతో ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానిక నేతలు, అధికారులు క్యూ కట్టారు. హైకోర్టు జడ్జిగా ఈ ప్రాంతానికి చెందిన మీరు ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. జడ్జి తుహిన్‌కుమార్‌ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే వీరఘట్టం, పాలకొండ, రేగిడి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కె.సూర్యప్రకాశరావు, డి.వెంకటరమణనాయుడు, కర్రి గోవిందరావు, పొట్నూరు లక్ష్మణరావు తదితరులు కలిశారు. వీరఘట్టం తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు తదితరులు జడ్జిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసుల అదుపులో పొట్టేళ్ల పందెంరాయుళ్లు
గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు శనివారం తెలిపారు. ఉల్లిబద్ర గ్రామ శివారులో పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న ప్రదేశంలో దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. రెండు పొట్టేళ్లను, రూ.1680 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు.
అక్రమంగా పశువుల తరలింపు
కొమరాడ: ఒడిశా నుంచి పార్వతీపురం సంతకు కొమరాడ మీదుగా జాతీయ రహదారిపై మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతుంది. బొలెరా వంటి వాహనాల్లో వందల సంఖ్యలో పశువులను అక్రమంగా తరలించేస్తున్నారు. వీటి రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం ఏమీ చూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. వీటిని కబేళాలకు తరలిస్తున్నట్టు అధికార యంత్రాంగానికి తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవహరించడంపై దుమారం రేగుతోంది. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై వందలాది పశువులను తరలిస్తూ అక్రమ సంపాదనపై అక్రమార్కులు గురి పెట్టినా నిఘా వర్గాలకు ఏమీ పట్టడం లేదు. మరోవైపు వందలాది కిలోమీటర్ల పొడవునా వీటిని నడిపిస్తూ కూడా కబేళాలకు తరలిస్తున్నా ఇటు పోలీసులకుగాని, అటు జంతు సంక్షేమ సంఘాలకు అనుమానం కలగకపోవడం విశేషం. ఇప్పటికై నా అధికార యంత్రాంగం మొద్దు నిద్రను వీగి మూగజీవాల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
నూతన బార్ పాలసీ విడుదల
విజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్లు 275, 276 ప్రకారం 2025–2028 సంవత్సరాలకు సంబంధించి నూతన బార్ పాలసీలను విడుదల చేసినట్టు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ శాఖ అధికారి బి.శ్రీనాథుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో గల 282బి బార్స్ నోటిఫై చేశామన్నారు. వీటిలో మూడు టూబీ బార్స్ కళ్లు గీత కులాలకు కేటాయించామన్నారు. ఈ వేలం ద్వారా ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపాలిటీ, నగర పంచాయతీలో ఎనిమిది 2బి బార్స్‌ను నోటిఫై చేశామన్నారు. వాటిలో రెండు 2బి బార్స్ కళ్లుగీత కులాలకు కేటాయించామన్నారు. ఆసక్తి గలవారు వారి పరిధిలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్‌లలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 9440902360, 9440902362 (విజయనగరం), 8348523855, 9398630486 (పార్వతీపురం మన్యం) నంబర్లను సంప్రదించాలని సూచించారు.

హైకోర్టు జడ్జి ఇంట సందడి

హైకోర్టు జడ్జి ఇంట సందడి