
బహిరంగ ప్రదేశాల్లో మద్యంతాగితే చర్యలు తప్పవు
● ఎస్పీ వకుల్ జిందల్ ● ఇప్పటికే 13,260 కేసుల నమోదు ● మందుబాబులకు పోలీసుల కౌన్సెలింగ్
విజయనగరం క్రైమ్: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జింద ల్ శనివారం హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టామన్నారు. ఇప్పటివరకు 13,260 కేసులు నమోదు చేశామన్నారు. దాడుల్లో పట్టుబడిన మైనర్‌లైన మందుబాబులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రహదారి భద్రత నియమాలు ఉల్లంఘించిన వారి నుంచి ఈ–చలానాలను విధిస్తున్నట్టు వెల్లడించారు.