విజయనగరం అర్బన్: జల వనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషన్, రెస్టరేషన్ ఆర్‌ఆర్‌ఆర్ కింద రూ.26 కోట్ల అంచనాతో 44 పనులను జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆమోదం తెలిపారు. నీటి వనరుల పునరుద్ధరణ, పరిరక్షణ, ఆక్రమణల నుంచి రక్షించడం, తాగునీటి లభ్యతను పెంచడం, భూగర్భ జలాల రీచార్జ్‌కు ఉద్దేశించిన ఈ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించనున్నాయని కలెక్టర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని కలెక్టర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని అన్నారు. ఈ పనులకు ఆమోదం లభిస్తే జిల్లాలో 6,873 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈ ఎంవీ రమణ, గ్రౌండ్ వాటర్ డీడీ ప్రవీణ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏడీ సంజీవ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీలో ఆమోదం తెలిపిన కలెక్టర్