
కొలతల్లో తేడా వస్తే కఠిన చర్యలు
విజయనగరం: వినియోగదారులు కోనుగోలుచేసే వస్తువుల కొలతల్లో తేడావస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ అండ్ మెట్రాలజీ డీడీ బి.మనోహర్ హెచ్చరించారు. నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో బేకరీ, స్వీట్ దుకాణదారులతో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వినియోగదారులు ఆహారపదార్థాలు కొనుగోలు చేసే సమయంలో బాక్స్ బరువును మినహాయించి తూకం వేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ కాటా వినియోగంలో జీరో రీడింగ్ కచ్చితంగా పాటించాలన్నారు. ప్యాకేజీ ఫుడ్స్ విషయంలో ప్రాథమిక నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కో ఆర్డినేటర్ చదలవాడ ప్రసాద్, లీగల్ మెట్రాలజీ ఏడీ పి.వి.రంగారెడ్డి, పరిశీలకులు ఎస్.ఉమా సుందరి, తదితరులు పాల్గొన్నారు.
లీగల్ అండ్ మెట్రాలజీ డీడీ బి.మనోహర్