
జేఎన్‌టీయూ జీవీలో 130 మంది రక్తదానం
విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, ఎన్టీర్‌ట్రస్ట్ సౌజన్యంతో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది 130 మంది 130 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు స్వయంగా రక్తదానంచేసి విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డి.రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్ జి.జయసుమ, డాక్టర్లు సోమశేఖర్, సునీత, యోగానంద్ పాల్గొన్నారు.