
ఎరువుల ధరలకు రెక్కలు..!
●
చర్యలు తీసుకుంటాం
విజయనగరం ఫోర్ట్:
కూటమి ప్రభుత్వంలో రైతన్నకు తిప్పలు తప్పడం లేదు. సకాలంలో సాగుసాయం అందక, విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక ఆవేదన చెందుతున్నారు. ఎరువులకు కృత్రిమకొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయంతో రైతుల జేబులు గుళ్లవుతున్నాయి. ప్రైవేటు డీలర్లు అడిగినంత ఇవ్వకపోతే ఎరువులు ఇవ్వడం లేదు. ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు 58వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం వీటికి జల్లేందుకు అవసరమైన ఎరువును రైతులు కొనుగోలు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు దొరకకపోవడంతో ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నవారికి చేతిచమురు వదులుతోంది.
బస్తాకు అదనంగా
రూ. 50 వరకు వసూలు
ఎరువులను డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. యూరియా బస్తా వాస్తవ ధర రూ.267కాగా రూ.300 నుంచి రూ.350వరకు వసూలు చేస్తున్నారు. అలాగే, డీఏపీ బస్తా రూ.1350 కాగా రూ.1400కు విక్రయిస్తున్నారు. ఇతర కాంప్లెక్స్ ఎరువులదీ ఇదే పరిస్థితి. డీలర్లు ఎరువుల ధరలు పెంచేసి రైతులను దోచేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డీఏపీ ఎరువు బస్తాలు
ఎరువులు ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఏ డీలర్ అయినా అధిక ధరకు విక్రయిస్తే సంబంధిత వ్యవసాయ అధికారికి రైతులు ఫిర్యాదు చేయాలి.
– వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి
ఎరువులు అధిక
ధరలకు విక్రయిస్తున్న డీలర్లు
డీఏపీ బస్తాకు అదనంగా రూ.50 వసూలు
యూరియా బస్తాకు రూ.30 నుంచి రూ.80లు చెల్లించాల్సిందే
ఆవేదనలో రైతన్న
ప్రశ్నిస్తే ఎరువులేదని కసురుతున్న
వ్యాపారులు

ఎరువుల ధరలకు రెక్కలు..!