
ప్రభుత్వ స్థలాలు, భూముల రీ సర్వే
● జేసీ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: ప్రభుత్వ స్థలాలు, భూ ముల రీ సర్వే జరుగుతోందని, ప్రభుత్వ అధికారులంతా తమ పరిధిలోని భూములను పరిరక్షించుకునేందుకు ఇది మంచి అవకాశమని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. ిపీజీఆర్‌ఎస్ అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ, వివిధ సంస్థల, అతుకుబడి భూముల సరిహద్దులు నిర్ణయించేందుకు నవంబర్ నెల లోపల రీ సర్వే జరుగుతుందన్నారు. రెవెన్యూ, దేవదా య, అటవీ, పంచాయతీ, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ, జిల్లా రిజిస్ట్రార్, మున్సిపల్, మైనారిటీ శాఖల అధికారులు తమ శాఖల భూములను రీ సర్వే చేసుకొని సరిహద్దులను నిర్ణయించుకోవాలని, మ్యుటేషన్లు చేయించుకోవాలని తెలిపారు.
శివారు ఆయకట్టుకు సాగునీరు అందాలి
విజయనగరం అర్బన్: ప్రాజెక్టుల పరిధిలో శివారు భూములకు సైతం సాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, నీటిపారుదలశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో పంటల స్థితిగతులు, సాగునీటి సరఫరా, వర్షపాతం తదితర అంశాలపై తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 60 శాతం సాగు విస్తీర్ణానికి కాలువల ద్వారా సాగునీరు అందుతోందని మిగిలిన 40 శాతం సాగు భూములు వర్షాధారంగా పేర్కొన్నారు. తోటపల్లి ప్రాజెక్టు నీరు శివారు భూములకు సరఫరా అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాకపోవడంతో సాగునీటి ఎద్దడి ఉందన్నారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, ఉద్యానశాఖ డీడీ సీహెచ్ చంద్రశేఖర్, తోటపల్లి ఈఈ పి.అప్పలనాయుడు పాల్గొన్నారు.
పరిమిత బస్సుల్లోనే ఉచిత ప్రయాణం
● మహిళలకు గుర్తింపు కార్డు తప్పనిసరి
● జిల్లా ప్రజారవాణా అధికారిణి
జి.వరలక్ష్మి
విజయనగరం అర్బన్: ఆర్టీసీ అందించే వివిధ రకాల సర్వీసుల్లో కొన్నింటిలోనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి కల్పిస్తుందని జిల్లా ప్రజారవాణా అధికారిణి జి.వరలక్ష్మి తెలిపారు. ‘సీ్త్ర శక్తి పథకం’ పేరుతో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సోమవారం ఆమె మార్గదర్శకాలు విడుదల చేశారు. రాష్ట్రంలో నివాసం ఉన్న బాలికలు, మహిళలు, లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు ఈ సౌకర్యానికి అర్హులన్నారు. దీనికోసం గుర్తింపుకార్డు తప్పనిసరన్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అనుమతిస్తామన్నారు. నాన్‌స్టాప్, అంతర్‌రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్టు సర్వీసులు, అల్ట్రాడీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్ని ఏసీ బస్సు సర్వీసులకు వర్తించదని స్పష్టంచేశారు. అర్హత ఉన్న మహిళా ప్రయాణికులందరికీ జీరో ఫేర్ టిక్కెట్లను జారీ చేస్తామన్నారు.
12న డీవార్మింగ్ డే
విజయనగరం ఫోర్ట్: జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీచేయాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడతూ జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, విద్యార్థులు సుమారు 3,60,000 మంది ఉన్నారని, వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మధ్యాహ్న భోజనం చేసిన అరగంట తర్వాత మింగించాలన్నారు. ఒకటి నుంచి రెండేళ్ల వయస్సువారికి 400 ఎంజీ అరమాత్ర, 2 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులకు పూర్తిమాత్ర వేయాలన్నారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, డీఎల్‌ఓ డాక్టర్ రాణి, తదితరులు పాల్గొన్నారు.
14న జిల్లా సమీక్ష సమావేశం
విజయనగరం అర్బన్: జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) ఈ నెల 14న జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు.

ప్రభుత్వ స్థలాలు, భూముల రీ సర్వే