
పేదల కాలనీపై కూటమి శీతకన్ను
లే అవుట్‌లో పూర్తికాని గృహనిర్మాణాలు
విజయనగరానికి సమీపంలో గుంకలాం వద్ద గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదల కోసం ఓ పెద్ద ఊరు నిర్మాణాన్ని తలపెట్టింది. 394.06 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద లే అవుట్ వేసింది. ఇందులోని 12,216 ఇళ్లస్థలాలకు గాను 11,091 ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించింది. 10,625 మందికి ఇళ్లను మంజూరు చేసింది. నాడు చకచకా సాగిన నిర్మాణాలు నేడు చతికలపడ్డాయి. కాలనీకి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం శీతకన్నువేసింది. అసంపూర్తి పనులు పూర్తిచేయాలంటూ కాలనీ వాసులు పలుసార్లు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసినా స్థానిక పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. సరైన సదుపాయాలు లేక కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొందరు నిర్మాణాలను అసంపూర్తిగానే విడిచిపెట్టేశారు. దీనికి ఈ చిత్రాలే సాక్ష్యం.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
నిలిచిన నిర్మాణం ఇలా..

పేదల కాలనీపై కూటమి శీతకన్ను