పోక్సోకేసులో ముద్దాయికి20 ఏళ్ల జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

పోక్సోకేసులో ముద్దాయికి20 ఏళ్ల జైలు శిక్ష

Aug 12 2025 11:21 AM | Updated on Aug 12 2025 11:21 AM

పోక్సోకేసులో ముద్దాయికి20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సోకేసులో ముద్దాయికి20 ఏళ్ల జైలు శిక్ష

విజయనగరం క్రైమ్‌/గుర్ల: జిల్లాలోని గుర్ల పోలీస్‌ స్టేషన్‌లో 2022 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి గుషిడి సూర్యనారాయణ (23)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,000లు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్‌జిందల్‌ సోమవారం తెలిపారు. కేసు వివరాలను వెల్లడించారు. గుర్ల మండలానికి చెందిన ఇంటర్మీడియట్‌ బాలిక కనిపించడంలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై గుర్ల పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదుచేశారు. బాలిక ఆచూకీని కనిపెట్టారు. విచారణలో నిందితుడు ప్రేమపేరుతో లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారయత్నానికి పాల్పడినట్టుగా తెలపడంతో అప్పటి ఎస్సీఎస్టీ సెల్‌ డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు పోక్సోకేసుగా మార్పుచేసి దర్యాప్తు చేశారు. మహిళా పీఎస్‌ డీఎస్పీ టి.త్రినాథ్‌ నిందితుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. ముద్దాయి మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా నేరం రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. కేసులో బాధితురాలికి రూ.2 లక్షల పరిహారాన్ని అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. కేసులో ముద్దాయిపై నేరం నిరూపణయ్యేలా పోక్సో కోర్టు ఇన్‌చార్జి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.ఖజానారావు వాదనలు వినిపించగా, గుర్ల ఎస్‌ఐ పి.నారాయణరావు, చీపురుపల్లి సీఐ శంకరరావు పర్యవేక్షణలో ఏఎస్‌ఐ వై.రమణమ్మ, సీఎంఎస్‌ హెచ్‌సీ సీహెచ్‌ రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారు. కేసులో ముద్దాయికి శిక్షపడేలా సాక్షులు ప్రవేశపెట్టిన పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement