
స్వచ్ఛంద నిర్ణయం.. అందరికీ ఆదర్శనీయం
చీపురుపల్లి: వారంతా డిగ్రీ చదువుతున్నారు. సామాజిక బాధ్యతతో ఎన్‌ఎస్‌ఎస్ విభాగంలో చేరి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడితో ఆగకుండా 56 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు తమ మరణానంతరం నేత్ర, అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. పట్టణంలోని శ్రీ సత్యరామ డిగ్రీ కళాశాలలో చదువుతున్న వారంతా ఒకే మాటపైకి వచ్చి స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. నేత్ర, అవయవదానం చేసేందుకు మూకుమ్మడిగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకు చెందిన బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి అక్కడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.శంకరరావు చేతులమీదుగా మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, రెడ్‌క్రాస్ డివిజినల్ కో ఆర్డినేటర్ బి.వి.గోవిందరాజుకు అంగీకార పత్రాలు అందజేశారు. నేత్ర, అవయవదానం ఉద్యమంలో భాగస్వామ్యులై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో (గోల్డెన అవర్) ప్రాణాలు కాపాడే బేసిక్ ఫస్ట్ ఎయిడ్‌లో శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
నేత్ర, అవయవదానానికి ముందుకొచ్చిన 56 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు