
డీఎస్సీ–2025 ఫలితాల్లో జిల్లా అభ్యర్థుల ప్రతిభ
విజయనగరం అర్బన్: వివిధ కేటగిరీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ–2025 ఫలితాలను ఎట్టకేలకు సోమవారం విడుదలయ్యాయి. టెట్ మార్కులతో డీఎస్సీ పరీక్ష మార్కులు జోడించి పాయింట్లను ప్రకటించారు. ఎస్జీటీలో యల్లంటి గణేష్ (గేదెలవలస) 94.5, పెదిరెడ్ల రామలక్ష్మి (కుంటినవలస) 92.8, నడిజాన శ్యామల (అయ్యన్నపేట) 92.8, వల్లే చంద్రకళ (అయ్యన్నపేట)కి 92.2, కోండ్రు అశ్వని (విజయనగరం) 92.13, దేవ హరిణి (చీపురుపల్లి) 91.54, టొంప జ్యోష్ణ 90.8, బాలి కుమారి (పత్తికాయవలస) 90.144 పాయింట్లు సాధించారు. పూర్తి ఫలితాలు రావాల్సి ఉంది. టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసిన వారికి సవరించే అవకాశం కల్పించారు.