
మాజీ ఎంపీపీకి పరామర్శ
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని గెడ్డపువలస గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొణిసి కృష్ణంనాయుడిని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావులు ఆదివారం పరామర్శించారు. ఇటీవల వారం రోజుల క్రితం మాజీ ఎంపీపీ కృష్ణంనాయుడు గుండెపోటుకు గురై విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాయకులిద్దరూ గెడ్డపువలస గ్రామానికి వెళ్లి కృష్ణంనాయుడిని పరిమర్శించి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, ఆరోగ్యం కుదుటపడేంత వరకు కూడా ఎలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎలాంటి ఒత్తిడికి లోనవ్వద్దని సూచించారు. కార్యక్రమంలో గరివిడి వైఎస్సార్‌సీపీ నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, బమ్మిడి కార్తీక్, కడుమల రాంబాబు, గుడివాడ తమ్మినాయుడు, యల్లంటి పోలీస్‌నాయుడు, వలిరెడ్డి లక్ష్మణ, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాలనాయుడు తదితరులు ఉన్నారు.