
సచివాలయ వ్యవస్థపై నిర్లక్ష్యం
● ఆధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా
పట్టించుకోని వైనం
● వినియోగంలోకి తేవాలని ప్రజల విజ్ఞప్తి
సాలూరు రూరల్: ఎంతో ప్రతిష్టాత్మకంగా గత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ప్రవేసపెట్టి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరా జ్యం అన్న నినాదానికి తగ్గట్లు సేవలు అందించిన సచివాలయ భవన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం సీతకన్ను వేసిందనే చెప్పవచ్చు. సాలూరు మండలంలోని 29 పంచాయతీల్లో 22 సచివాలయ భవనాలు మంజూరు చేసిన గత ప్రభుత్వం దాదా పు 15 సచివాలయాలు పూర్తిచేయడమే కాకుండా మరికొన్నింటికి శ్లాబులు వేసి ఉన్నాయి. కొన్ని పారంభానికి సిద్దంగా ఉన్న భవనాలు కూడా రంగులు వేసి ప్రజలకు సేవలంచేందుకు సిద్ధం చేయాల్సి న కూటమి ప్రభుత్వం కనీసం ఏడాది పూర్తయినా వాటిని పట్టించుకోకపోవడంతో ఆయా పంచాయతీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు గ్రామాల్లో ఉంటే ప్రజలకు దగ్గరగా సేవలు అందుతాయని నమ్ముతున్నారు. ఇంటింటికీ సేవలందించే సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయాలని మేధావులతో పాటు పలు పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.

సచివాలయ వ్యవస్థపై నిర్లక్ష్యం