
విజయనగరం
సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సచివాలయ వ్యవస్థపై నిర్లక్ష్యం
ఎంతో ప్రతిష్టాత్మకంగా గత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను నేటి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
–8లో
●మెంటాడ మండలానికి చెందిన 12 ఏళ్ల బాలుడికి జ్వరం రావడంతో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా డెంగీ అని తేలింది. ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోవడంతో పరిస్థితి విషమం కావడంతో ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స తీసుకుని తరువాత డిశ్చార్జ్ అయ్యాడు. రూ.70 వేల వరకు ఖర్చయింది.
●బొండపల్లి మండలానికి చెందిన హుస్సేన్ జ్వరంతో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఇతనికి మలేరియా అని నిర్ధారణ అయింది. అక్క డ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి మెరు గుపడకపోవడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రూ.లక్ష వరకు ఖర్చయింది.
●విజయనగరం పట్టణానికి చెందిన రమణ అనే వ్యక్తి జ్వరంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరాడు. అతనికి ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో సర్వజన ఆసుపత్రి లోని బ్లడ్ బ్యాంక్ నుంచి ప్లేట్‌లెట్స్
తీసుకువెళ్లి ఎక్కించారు.
●పెరుగుతున్న మలేరియా కేసులు ●డెంగీది అదే పరిస్థితి ●రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు
●చర్యలు తీసుకుంటున్నాం...
మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో సీహెచ్‌వోలు, ఏఎన్‌ఎంలు జ్వరపీడితులు ఉంటే గుర్తించి వారికి మలేరియా, డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే రిఫరల్ ఆసుపత్రికి పంపుతున్నారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌వో
న్యూస్‌రీల్

విజయనగరం

విజయనగరం

విజయనగరం