
ప్రైవేటులో దోపిడీ..
జ్వరాల బారిన పడి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న రోగులకు బిల్లులు తడిసిమోపుడు అవుతున్నాయి. జ్వరాలకు రూ.వేలు, లక్షల్లో ఖర్చవుతుంది. జిల్లాలో ఎక్కడికక్కడ క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్ లు వెలిశాయి. రెండు మూడు రోజుల పాటు చికిత్స కోసం ఉంటే రూ.20వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. వారం రోజు ల పాటు ఉంటే రూ.70 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. పొరపాటున వ్యాధి తగ్గక పది రోజులు దాటితే ఏదో ఒక రూపాన రూ. లక్షల్లో ఫీజులు దోచేస్తున్నారు.
ఆసుపత్రులు కిటకిట
జిల్లాలో ఏ ఆసుపత్రి చూసినా జ్వర పీడితుల తో కిటకిటలాడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నా యి. జిల్లాలో ప్రైవేటు క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్ లు 300 వరకు ఉన్నాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు 50 వరకు ఉన్నాయి. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు ఏడు ఉన్నాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఒకటి ఉంది. పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు మరో 18 ఉన్నాయి. వీటిల్లో జ్వర పీడితులు ఓపీలో కొందరు చికిత్స పొందుతుండగా, మరికొందరు ఇన్ పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు.