
చంద్రబాబు పతనం ఆరంభం
విజయనగరం:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పతనం ఆరంభమైంది. రాష్ట్రంలో 50 శాతానికి పైబడి ఓటర్లున్న బీసీ నాయకులపై దాడులను ప్రోత్సహించడం ఆయన చేసిన ఘోర తప్పిదమని వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు మహంతి జనార్దన్ హెచ్చరించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ గుండాలు, నాయకులు చేసిన దాడిని, హత్యాప్రయత్నాలను ఖండించారు. బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ కూడలి వద్ద ఉన్న జ్యోతీరావు పూలే విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ముందుగా మహా త్మా జ్యోతీరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులంతా నివాళులర్పించారు. అనంతరం బీసీ నాయకునిపై జరిగిన దాడికి నిరసనగా సీఎం చంద్రబాబు డౌన్‌డౌన్... బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీలపై దాడులు సిగ్గుసిగ్గు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఏడాది వ్యవధిలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబు, తాజాగా ప్రకటించిన ఉపఎన్నికల్లో ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరల అటువంటి చర్యలకు ఆస్కారం లేదని, ఓడిపోతే పరువుపోతుందన్న భయం పట్టుకుందంటూ ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలను ఎండగడతామన్నారు.
●వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను ఓటమి భయంతో చంద్రబాబు అతని అనుచరులతో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. గెలుపుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ప్రజలు మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శులు బమ్మిడి అప్పలనాయుడు, బొమ్మి శ్రీను, పార్టీ జిల్లా నాయకులు వర్రి నరసింహమూర్తి, ఎస్.బంగారునాయుడు, అల్లు అవినాష్, కె.సాయికుమార్, డోల మన్మథకుమార్, పతివాడ కృష్ణవేణి, కె.శ్రీనివాస్, డి. కొండబాబు, ఎ.వేణు, ఎంపీపీ అప్పలనాయుడు, కె.త్రినాథ్, జి.సూర్యప్రకాశ్, లంక వెంకటరావు, అప్పలకృష్ణ పాల్గొన్నారు.
రాష్ట్రంలో 50 శాతం ఓటర్లు ఉన్న బీసీలపై దాడులా...? బీసీలు కన్నెర్ర చేస్తే టీడీపీ బంగాళాఖా తంలో కలిసిపోవడం ఖాయం వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు మహంతి జనార్దన్
కడప ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడిని
ఖండించిన జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు
జిల్లా కేంద్రంలోని జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద నిరసన