
పుష్పధరహాసం
రాజాం: పూల ధరలకు రెక్కలొచ్చాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు శ్రావణ శుక్రవారం, మంగళవారం పూజలతో పూలకు డిమాండ్ పెరిగింది. గతంలో కంటే కిలోకు రూ.100లు నుంచి రూ.400లు ధర పెరిగింది. రాజాంలో కిలో మల్లెలు రూ.800 నుంచి రూ.900లు, చామంతి రూ. 450, బంతిపూలు రూ.200, లిల్లీలు కిలో రూ.350, గులాబీలబుట్ట ధర రూ.750లు, కనకాంబరాలు బారు ధర రూ.350, వివాహ దండలు రూ.800లు నుంచి రూ.2,500లు మధ్య, గులాబీ పెళ్లి దండలు రూ.1200లు, గుమ్మపు దండలు రూ.1000లు చొప్పున పలుకుతున్నాయి. చామంతి ధర గతంలో కంటే కిలోకు రూ.150లు పెరగగా, కనకాంబరాల దండలు ధర గతంలో కంటే రెట్టింపు అయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, ఆలమూరు, ఆత్రేయపురం, చిత్తూరు, కర్ణాటక, తమిళనాడు నుంచి ఇక్కడి వ్యాపారులు పూలను దిగుమతి చేసుకుంటున్నారు.