
డీపీటీసీ పరిశీలన
● ఆరంభం కానున్న పోలీస్ అభ్యర్థుల శిక్షణ తరగతులు
విజయనగరం క్రైమ్: సారిపల్లిలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (డీపీటీసీ)ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం పరిశీలించారు. త్వరలో సుమారు 150 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు శిక్షణకు రానున్నందు న, అవసరమైన అన్ని మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిక్ష ణ కేంద్రంలోని తరగతి గదులు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్, వాష్‌రూమ్, స్నానపు గదులు, లైబ్రరీ, పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్‌లను ఎస్పీ పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో కంప్యూటర్లు, ఫ్యాన్‌లను వినియోగంలోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి తాగునీటి సరఫరాకు అంతరా యం లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట అద నపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, సీఐలు ఎ.వి.లీలారావు, జి.రామకృష్ణ, బి.లలిత, ఏఆర్ ఎస్‌ఐ జి.గోపాలనాయుడు, నెల్లిమర్ల ఎస్‌ఐ గణేష్, తదితరులు ఉన్నారు.