
● వరుణదేవా.. కరుణించరావా..!
● వర్షాకాలంలో మండుతున్న ఎండలు
కోట వద్ద గొడుగు నీడలో వ్యాపారం
తలపై చున్నీతో పాద
చారి
వర్షాలతో చల్లని వాతావరణం ఉండాల్సిన సమయంలో భానుడు భగభగమండుతున్నాడు. ఉదయం 10 గంటలైతే చాలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి. గొడుగులు, చున్నీలు, మర్ఫీల చాటున బుధవారం రాకపోకలు సాగిస్తున్న విజయనగర పట్టణ వాసులను చిత్రాల్లో చూడొచ్చు.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
వరుణుడు కరుణించడం లేదు. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈ ప్రభావంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి వెదలు, నాట్లు, నారుమడులు ఎండిపోతున్నాయి. ఆశ్లేష కార్తె ఆరంభంలో వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతన్నకు నిరాశే ఎదురైంది. ఆకాశం వైపు ఆశగా చూస్తున్నా చినుకుజాడ కనిపించడం లేదు. వంగర మండలంలో ఎస్.ఎస్.చానల్ నుంచి సాగునీరు సరఫరా కాకపోవడం, వర్షాలు కురవకపోవడంతో కొప్పర, కె.కొత్తవలస, కొండచాకరాపల్లి తదితర గ్రామాల్లోని సుమారు 800 ఎకరాల్లో వరి వెదలు ఎండిపోతున్నాయి. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటే పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. – వంగర
ఇప్పుడు ఏ పల్లె, పట్టణం, వీధిలో అయినా మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. బహిరంగ మద్యపానం యథేచ్ఛగా సాగుతోంది. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. వివాదాలకు కారణంగా మారుతోంది. వీటిని కట్టడిచేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బొబ్బిలి సీఐ కె.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించగా టీబీఆర్ థియేటర్ ప్రాంతంలో కాలువ గట్టుపై బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించారు. వెంటనే పోలీసులను పంపించి వారిని పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం సేవించి వాహనాలను నడిపినా కేసులు నమోదుచేస్తామని సీఐ హెచ్చరించారు. – బొబ్బిలి

● వరుణదేవా.. కరుణించరావా..!

● వరుణదేవా.. కరుణించరావా..!

● వరుణదేవా.. కరుణించరావా..!

● వరుణదేవా.. కరుణించరావా..!

● వరుణదేవా.. కరుణించరావా..!

● వరుణదేవా.. కరుణించరావా..!