ప్రభుత్వ బడుల్లో రెడ్‌బుక్‌ రాజ్యాంగమా? | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో రెడ్‌బుక్‌ రాజ్యాంగమా?

Aug 7 2025 11:05 AM | Updated on Aug 7 2025 11:05 AM

ప్రభు

ప్రభుత్వ బడుల్లో రెడ్‌బుక్‌ రాజ్యాంగమా?

విజయనగరం గంటస్తంభం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారాలోకేశ్‌ బాధ్యత వహిస్తున్న విద్యాశాఖలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుపై విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే విద్యావ్యతిరేక విధానాలతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం... తాజాగా ఈ నెల 1వ తేదీన ఆర్సీ నెం: 30/67/2025ను తీసుకురావడాన్ని తప్పుబడుతున్నారు. ఈ సర్క్యులర్‌ ప్రకారం పాఠశాలల్లోకి తల్లిదండ్రులకు, ఎస్‌ఎంసీ సభ్యులు మినహా ఇతరులు ఎవరూ వెళ్లకూడదు. ఎటువంటి ఫిర్యాదులైనా పరిపాలనా విభాగంలోనే ఇవ్వాలి. విద్యార్థులతో మరెక్కడా ఫిర్యాదులు చేయించరాదు. వీటిని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆర్టికల్‌ 19(1)(సి) ప్రకారం దేశ పౌరులకు సంఘాలు ఏర్పా టు చేసుకునే హక్కును రాజ్యాంగం ఇచ్చిందని, ఇది విద్యార్థులకు వర్తిస్తుందని, విద్యార్థి సంఘాలను విద్యాసంస్థలకు దూరం చేస్తే అక్కడి సమస్యలపై ప్రశ్నించేవారు, అధికారులకు తెలియజేసేవారు ఎవరని ప్రశ్నిస్తున్నాయి. 1975లో తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘంలో ఉంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన విషయాన్ని ఆయన కుమారుడు లోకేశ్‌ గుర్తించాలని పేర్కొన్నాయి. విద్యార్థి సంఘాల నోరునొక్కేసి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.

పాఠశాలల్లోకి తల్లిదండ్రులకు, ఎస్‌ఎంసీ సభ్యులు మినహా మిగిలిన వారికి అనుమతి బంద్‌

రాజ్యాంగానికి విరుద్ధంగా 30/67/2025 సర్క్యులర్‌ జారీ

రాజ్యాంగ విరుద్ధ సర్క్యులర్‌

రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. విద్యా సంస్థల్లో విద్యార్ధి సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం ఎప్పుడో ఇచ్చింది. దానిని రద్దు చేయడంలో అంతర్యం ఏమిటో చెప్పాలి. రాష్ట్రంలో పాఠశాలల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. విద్యాశాఖ మంత్రిగా వాటి మీద దృష్టి పెట్టాల్సిన నారా లోకేశ్‌.. పాఠశాలలో విద్యార్థి సంఘాలను నిషేధించాలంటూ రాజ్యాంగ వ్యతిరేక సర్క్యులర్‌ జారీ చేయడం తన చేతకానితనానికి నిదర్మనం.

– డి.రాము, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు,

విజయనగరం

విద్యార్థి సంఘాలను అనుమతించకపోవడం దుర్మార్గం

విద్యావ్యవస్థలో విద్యార్థి సంఘాల ఏర్పాటు, జోక్యం వంటి హక్కులను రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ హక్కును మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో కాలరాస్తే ఎలా?. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే సంఘాలను పాఠశాలల కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయడం దుర్మార్గ చర్య. ఇప్పటికైనా ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమానికి సన్నద్ధమవుతాం.

– జె.రవికుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, విజయనగరం

రాజ్యాంగ విరుద్ధ సర్క్యులర్‌

రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. విద్యా సంస్థల్లో విద్యార్ధి సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం ఎప్పుడో ఇచ్చింది. దానిని రద్దు చేయడంలో అంతర్యం ఏమిటో చెప్పాలి. రాష్ట్రంలో పాఠశాలల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. విద్యాశాఖ మంత్రిగా వాటి మీద దృష్టి పెట్టాల్సిన నారా లోకేశ్‌.. పాఠశాలలో విద్యార్థి సంఘాలను నిషేధించాలంటూ రాజ్యాంగ వ్యతిరేక సర్క్యులర్‌ జారీ చేయడం తన చేతకానితనానికి నిదర్మనం.

– డి.రాము, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు,

విజయనగరం

విద్యార్థి సంఘాలను అనుమతించకపోవడం దుర్మార్గం

విద్యావ్యవస్థలో విద్యార్థి సంఘాల ఏర్పాటు, జోక్యం వంటి హక్కులను రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ హక్కును మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో కాలరాస్తే ఎలా?. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే సంఘాలను పాఠశాలల కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయడం దుర్మార్గ చర్య. ఇప్పటికై నా ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలు మానుకోవాలి. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమానికి సన్నద్ధమవుతాం.

– జె.రవికుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, విజయనగరం

ప్రభుత్వ బడుల్లో రెడ్‌బుక్‌ రాజ్యాంగమా? 1
1/2

ప్రభుత్వ బడుల్లో రెడ్‌బుక్‌ రాజ్యాంగమా?

ప్రభుత్వ బడుల్లో రెడ్‌బుక్‌ రాజ్యాంగమా? 2
2/2

ప్రభుత్వ బడుల్లో రెడ్‌బుక్‌ రాజ్యాంగమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement