నేటి నుంచి ఇంటర్ కళాశాలల పునఃప్రారంభం
విజయనగరం అర్బన్: జూనియర్ కళాశాలల కు వేసవి సెలవులు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూ నియర్ కళాశాలలు 18, కేజీబీవీలు 26, ఆదర్శ పాఠశాలలు 16 ఉన్నాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు కళాశాలలకు హాజరు కావాలని ఆర్‌ఐఓ ఎస్.తవిటినాయుడు సూచించారు.
రేషన్ పంపిణీ పరిశీలన
విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని కేఎల్‌పురంలో 281098 నంబర్ రేషన్ షాపును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదివారం పరిశీలించా రు. సరుకుల నిల్వపై ఆరా తీశారు. సరుకుల ను సకాలంలో పంపిణీ చేయాలని డీలర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయన వెంట డీఎస్‌వో మధుసూదన్‌రావు, సీఎస్‌డీటీ రామారావు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ
విజయనగరం అర్బన్: బోధన నైపుణ్యాలకు సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక రోజు ఉచిత శిక్షణా తరగతులు స్థానిక యూత్ హాస్టల్‌లో ఆదివారం నిర్వహించారు. శిక్షకుడు విల్ 2 కెన్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణలో స్పోకెన్ ఇంగ్లిష్ విద్యార్థులకు నేర్పించడంలో ఉపాధ్యాయులు తెలుసుకోవలసిన మెలకువలు వివరించారు. ఈ మెలకువలతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షకుడు రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను పెంపొందించే ఇలాంటి శిక్షణలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, శిక్షణ ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ శిక్షణ కళాశాల సీఐ మురళి, ఉపాధ్యాయులు సోమశేఖర్, రెడ్డి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని పేర్కొన్నాయి.
నేటి నుంచి ఇంటర్ కళాశాలల పునఃప్రారంభం


