డీఎస్సీకి 31,038 దరఖాస్తులు
విజయనగరం అర్బన్: డీఎస్సీ–2025 పరీక్షకు జిల్లా నుంచి 18,001 మంది అభ్యర్థులు 31,038 దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పురుషుల కంటే మహిళలు 2,449 మంది అధికం. దరఖాస్తుదారుల్లో మహిళలు 10,225 మంది, పురుషులు 7,776 మంది ఉన్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలుపుకొని 583 పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీతో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నోటిఫికేషన్‌లో ఊహించని కఠిన నిబంధనలు విధించడం వల్ల వేల సంఖ్యలో నిరుద్యోగులు అర్హత కోల్పోయినట్టు సమాచారం.
పురుషుల కంటే
మహిళల
దరఖాస్తులు
2,449 అధికం


