పన్ను ఎగవేతదారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
విజయనగరం అర్బన్: పన్ను ఎగవేతదారులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయించేందుకు పోలీస్ యంత్రాంగంతో తహసీల్దార్లు సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్రపన్నుల సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి, సంబంధిత తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆయన చాంబర్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ వారు జీఎస్టీ బకాయిలు, జనరల్ సేల్స్‌ట్యాక్స్, వ్యాట్ చట్టంలో గల బకాయిలు, రెవెన్యూ రికవరీ కేసులకు కేసులకు సంబంధించి పన్ను ఎగవేతదారుల నుంచి బకాయి రాబట్టేందుకు జిల్లా యంత్రాంగం సహకారం కోరారు. దీనికి జేసీ స్పందిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్లార్లకు మార్గనిర్దేశం చేశారు. సరైన ప్రణాళికను సిద్ధం చేయాలని సంయుక్త కమిషనర్, రాష్ట్ర పన్నులు, ఉప కమిషనర్ రాష్ట్రపన్నుల శాఖకు సూచించారు. సమీక్షలో అదనపు ఎస్పీ సౌమ్యలత, ఆర్‌డీఓ కీర్తి, జిల్లా అధికారులు, సంయుక్త కమిషనర్, రాష్ట్ర పన్నులు, ఉప కమిషనర్, రాష్ట్ర పన్నులు, జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి, విజయనగరం, సంబంధిత తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
జేసీ సేతు మాధవన్


