నూతన సంవత్సర శుభాకాంక్షలు
విజయనగరం అర్బన్: జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ముందస్తు నూతన సంవత్సరం–2026 శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు కేవలం నోట్ బుక్స్, పెన్నులు మాత్రమే తీసుకురావాలని, బొకేలు, స్వీట్స్, పూల దండలు తీసుకురావద్దని కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నాయి.
పదోతరగతి మోడల్ పేపర్స్ ఆవిష్కరణ
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రూపొందించిన 10వ తరగతి మోడల్ పేపర్స్‌ను డీఈఓ యు.మాణిక్యంనాయుడు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయ సంఘాల కృషి అభినందనీయమన్నారు. అనంతరం సంఘం రూపొందించిన వార్షిక డైరీ, వాల్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్‌రావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్.భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు మీసాల అప్పలనాయుడు, జిల్లా కోశాధికారి తిరుపతినాయుడు, సీనియర్ నాయకులు డి.రాము, జే.రమేష్ చంద్రపట్నాయక్, జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ మాధవీలత పాల్గొన్నారు.
కొత్త పట్టాదారు
పాస్ పుస్తకాల పంపిణీ
విజయనగరం అర్బన్: జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అధికారులు ముందుగా నిర్దేశించిన గ్రామాల్లో ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొత్తపట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీచేస్తారని చెప్పారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు


