సైనిక్ స్కూల్‌లో ఆటల సందడి
విజయనగరం రూరల్: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ పుట్‌బాల్ టోర్నీలో భాగంగా జిల్లాలోని కోరుకొండ సైనిక్ పాఠశాలలో ‘ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఇంట్రా గ్రూప్ ఆఫ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్–2025–26 సోమవారం ప్రారంభమైంది. పోటీలను కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి ప్రారంభించారు. ఈ పోటీల్లో అంబికాపూర్, భువనేశ్వర్, సంబల్‌పూర్, కోరుకొండ సైనిక్ స్కూల్స్ నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ కిరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్క్వాడ్రన్ లీడర్ అతుల్ జాన్ థామస్ పాల్గొన్నారు. టోర్నీలో బాలురు, బాలికలకు సబ్–జూనియర్, జూనియర్ విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు.
ఆల్ ఇండియా ఇంట్రా సైనిక్ ఫుట్‌బాల్ టోర్నీ– 2025 ప్రారంభం


