27న సారిపల్లిలో బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా సీ్త్ర, పురుషుల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 27న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసి యేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రంగారావుదొర, కేవీ ప్రభావతి శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో గల చంపావతి నదిలో ఎంపిక పోటీలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే పురుష క్రీడాకారులు 85 కేజీలలోపు, సీ్త్రలు 75 కేజీలలోపు బరువు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆ రోజు జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడలో జరగనున్న అంతర్‌జిల్లాల సీ్త్ర, పురుషుల బీచ్ కబడ్డీ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9949721949 నంబర్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు.
28న జీఎంఆర్‌నైరెడ్‌లో
ఇంటర్వ్యూలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్‌లో ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఈ నెల 28న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు శిక్షణకు అర్హులన్నారు. పురుషులకు హౌస్‌వైరింగ్ (30 రోజులు), బైక్ రిపేరింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (30 రోజులు), కంప్యూటర్ ట్యాలీ అండ్ బేసిక్స్ (30 రోజులు), అలాగే సీ్త్రలకు లేడీస్ టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్ (35 రోజులు), మగ్గం వర్క్స్ అండ్ శారీ పెయింటింగ్ వర్క్స్ (31 రోజుల పాటు)లో శిక్షణ ఉంటుందన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డుతో రావాలని సూచించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9014716255, 9491741129, 9866913371, 9989953145 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌గా డాక్టర్ సాయిరాం
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్య సేవ) జిల్లా కోఆర్డినేటర్‌గా డాక్టర్ కేసీపీఏవీ సాయిరాం నియమితులయ్యారు. ఈమేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన సతివాడ పీహెచ్‌సీ వైద్యాధికారిగా ఉన్నారు. ఫారిన్ సర్వీస్‌పై ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు.
వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు
పార్వతీపురంటౌన్: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగ కమిటీలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పలువురిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా బంకపల్లి వాసుదేవరావు, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా దాసరిమాధవ రావు నిమితులయ్యారు.


