
సూర్యఘర్‌తో నాణ్యమైన విద్యుత్
విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటుచేయాలని, నాణ్యమైన విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలని ఎంపీ, విద్యుత్ కమిటీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం మూడువేల సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సూర్యఘర్ పలకల ఏర్పాటుకు స్థలాలు లేనిచోట పంచాయతీరాజ్ చెరువు గట్లను వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే మూడునెలల్లో 10వేల పీఎం సూర్యఘర్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. సమావేశంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు, ఈఈలు హరి, త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.