24న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
● యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వి.నర్సింహరావు
విజయనగరం గంటస్తంభం:
కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 24న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికుల ధర్నాలు జరుగుతాయని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్.వి.నర్సింహరావు అన్నారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పడు మొఖం చాటేశారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డులో రూ.4,293 కోట్లు నిధులు ఉన్నాయని, వాటితో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి.రమణ, నాయకులు బి.సత్యం, కె.సంతోష్‌కుమార్, ఆర్.సతీష్ పాల్గొన్నారు.


