
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
విజయనగరం: జిల్లా కేంద్రం వేదికగా జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ఉల్లాస భరిత వాతావరణంలో ప్రారంభమైంది. నగరంలోని సిటీ క్లబ్ ఆవరణలో అండర్ – 12, 16, 30 ప్లస్, 40 ప్లస్, 50 ప్లస్ వయస్సుల కేటగిరీల్లో శనివారం నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 60 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. విజయనగరం సిటీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతి ప్రధానోత్సవం చేయనున్నారు. టెన్నిస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ తరహా పోటీలను త్వరలో మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు రామారావు, రంగబాబు, వైభవ్ తెలిపారు. జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలను ఒకప్పుడు సిటీ క్లబ్ నిర్వహించిందని, ఎందరో అంతర్జాతీయ ఆటగాళ్లు సిటీ క్లబ్‌లో ఆడారని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఐదు విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టెన్నిస్ జాతీయ స్థాయి క్రీడాకారులు సన్యాసిరాజు, కోచ్ గౌరీశంకర్, నిర్వాహకులు సాత్విక్, కౌశిక్, సీనియర్ ప్లేయర్స్ ఈ పోటీలను ప్రారంభించారు.
జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం