డ్రోన్ల వినియోగంలో సెంచూరియన్ సహకరించాలి
విజయనగరం అర్బన్: వ్యవసాయం, ఉద్యాన వనాల అభివృద్ధిలో డ్రోన్ల వినియోగానికి సహకరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సెంచూరియన్ వర్సిటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్‌రాజుతో కలెక్టర్ భేటీ అయ్యా రు. సెంచూరియన్ యూనివర్సిటీలో చేపడుతున్న కోర్సుల వివరాలను, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ గురించి కలెక్టర్‌కు చాన్స్‌లర్ వివరించారు. యువతకు నైపుణ్యం ఇవ్వడానికి తాము సిద్ధంతా ఉన్నాయని చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్‌రాజు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్న కో ర్సులు, నైపుణ్య శిక్షణలు, సీడాప్ ఒప్పందం గురించి వివరించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి మాట్లాడుతూ త్వరలో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా యువతకు నైపుణ్య కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే డ్రోన్లతో వ్యవసాయం ఇతర రకాల సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. దీనికి కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ స్పందిస్తూ తాను త్వరలో విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. వ్యవసాయంలో ప్రస్తుతం మామిడి పంట ఉన్నందున తెగుళ్లు నివారణకు డ్రోన్ల ద్వారా కృషి చేయాలని కోరారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్


