నల్ల చట్టాలకు ఆమోదం తెలపడం బాధాకరం
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న ఈద్‌గాలో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. వక్ఫ్ అమెండ్‌మెంట్ వంటి నల్ల చట్టాలకు టీడీపీ ఆమోదం తెలపడంపై ముస్లింలు ప్రశ్నించారు. ముస్లింను కేవలం ఓట్లకోసమే వినియోగించుకుంటారా? కష్టాల్లో సహాయంగా నిలబడరా అని ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ చట్టాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం మద్దతు తెలపడం ఎంతవరకూ సమంజసమన్నారు. రంజాన్‌లో తమకు కావాల్సింది శుభాకాంక్షలు, ఇఫ్తార్ విందులు కాదని, బిల్లుపై వ్యతిరేకత చూపిస్తే అదే ఒక బహుమానమని పేర్కొన్నారు.


