శరీర కొలతలు
అగ్నివీర్ జనరల్ డ్యూటీ మరియు అగ్ని ట్రేడ్స్‌మెన్ పోస్టులకు 166 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్ పోస్టుకు 165 సెంటీమీటర్లు, అగ్నివీర్ క్లర్క్/టెక్నికల్ పోస్టులకు 162 సెంటీమీటర్లు ఎత్తు తప్పనిసరి. 77 సెంటీమీటర్ల కనీస విస్తీర్ణంతో ఛాతీ ఉండి ఊపిరి పీల్చేటప్పుడు 5 సెంటీమీటర్ల విస్తీర్ణం పెరగాలి. ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండాలి. ఎంపికై న వారిని 4 సంవత్సరాల షార్ట్ టర్మ్ సర్వీసు అగ్నివీర్ సర్వీస్‌లోనికి తీసుకుంటారు. దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దని ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం సెట్విజ్ కార్యాలయంలోని మేనేజర్ వెంకటరమణ 9849913080 నంబరుకు సంప్రదించాలని ఆయన సూచించారు.
విజయనగరం అర్బన్: భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను వచ్చే నెల 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ద్వారా నమోదు చేసుకున్న అభ్యర్థులు అడ్మిన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకొని ఆర్మీ ర్యాలీ జరిగే తేదీ, సమయం పొందవచ్చునని తెలిపారు. తొలిత ఆన్‌లైన్ పరీక్ష పాసైన అభ్యర్థులకు ఆర్మీ ర్యాలీ (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్) నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ: 10వ తరగతిలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
అగ్నివీర్ టెక్నికల్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ మరియు ఇంగ్లిష్ సబ్జెక్టులతో కనీసం 50 శాతంతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్:
ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్:
8వ/10వ తరగతి ఉత్తీర్ణత. అభ్యర్థులు 2004 అక్టోబర్ 1 నుంచి 2008 ఏప్రిల్1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి.
పోస్టుల వివరాలు, విద్యార్హతలు
ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్