రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు

Mar 16 2025 1:35 AM | Updated on Mar 16 2025 1:35 AM

రోడ్డ

రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు

రాజాం: ప్రముఖ సినీ నటి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్‌ మీనాక్షి చౌదరి రాజాంలో శనివారం సందడి చేశారు. సీఎంఆర్‌ 18వ జ్యువెలరీ షోరూంను జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. షోరూంలో వెండి, బంగారు నగలను పరిశీలించారు. వాటిని అలంకరించుకుని మురిసిపోయారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎంఆర్‌ యాజమాన్యంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన జ్యువెలరీతో పాటు నూతన వస్త్రాలను సరసమైన ధరలకే అందిస్తూ సీఎంఆర్‌ ప్రజల ఆదరణ పొందుతోందన్నారు. రాజాంలో కొత్తగా ఏర్పాటుచేసిన షోరూంలో ఇచ్చే ఆఫర్ల ను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఎంఆర్‌ డైరెక్టర్లు మావూరి వెంకటరమణ, మావూరి సత్యవీరసంతోష్‌మోహన్‌బాలాజీ, హారిక, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, సీతారామ గ్రూప్‌ ఎండీ సి.వి.జగన్నాథ స్వామి, వైద్యుడు ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు అంటే ఇష్టం

తెలుగు భాష అంటే చాలా ఇష్టమని, తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఎక్కువగా రావడం అదృష్టమని మీనాక్షి చౌదరి అన్నారు. ఆమెను చూసేందుకు వచ్చిన రాజాం ప్రజలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగుభాషలో 8 సినిమాల్లో నటించానన్నారు. వీటిలో లక్కీభాస్కర్‌, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయన్నారు. త్వరలో నాగచైతన్యతో సినిమా తీస్తున్నట్టు వెల్లడించారు. డెంటల్‌ విభాగంలో వైద్యవిద్యను అభ్యసించానని, స్విమ్మింగ్‌, బ్యాండింటన్‌ క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉందని, ఆ పాత్రల్లో నటించాలని ఉందన్నారు.

చీపురుపల్లిరూరల్‌ (గరివిడి): తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని గరివిడి వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల విద్యార్థులు కోరారు. కళాశాలకు వీసీఐ గుర్తింపు, స్టైఫండ్‌ రూ.25వేలకు పెంచాలని 41 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవడంపై మండిపడ్డారు. దీనికి నిరసనగా గరివిడి–విజయనగరం ప్రధాన రోడ్డుపై శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాసేపు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

సీఎంఆర్‌ జ్యువెలరీ

షోరూం ప్రారంభం

41వ రోజుకు చేరుకున్న నిరవధిక దీక్షలు

ప్రభుత్వ తీరుపై నిరసన

రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు 1
1/3

రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు

రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు 2
2/3

రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు

రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు 3
3/3

రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement