సారా రహిత జిల్లాయే లక్ష్యం
● ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14405
● కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్
విజయనగరం గంటస్తంభం: సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 14405కు విస్త్రత ప్రచారం కల్పించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని ఋధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తమ గ్రామంలో ఎక్కడా సారా తయారీ గానీ, వినియోగం గానీ జరగడం లేదని అన్ని గ్రామాల్లో పంచాయితీ తీర్మానాలను తీసుకోవలని సూచించారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత, అప్పటికీ సారా తయారీ, వినియోగం జరుగుతున్నట్లు గుర్తించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, అదుపు చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అబ్కారీ శాఖతో పాటు పోలీసులు, అటవీశాఖ కూడా సారా తయారీపై నిఘా పెంచాలని కోరారు. అటవీ ప్రాంతంలో ఎక్కడైనా సారా తయారీ జరిగితే, దానికి అటవీశాఖదే బాధ్యత అని స్పష్టం చేశారు. జిల్లాను సారా రహితంగా మార్చడంలో అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. నవోదయం 2.0 కు సంబంధించిన వాల్‌పోస్టర్, స్టిక్కర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించి ప్రచార రఽథాన్ని ప్రారంభించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ జేసీ ఎస్.శ్రీనివసమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాథుడు, అటవీశాఖాధికారి కొండలరావు, డీఈఓ మాణిక్యంనాయుడు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


