అందరి చూపు వైఎస్సార్‌సీపీ వైపే.. | Sakshi
Sakshi News home page

అందరి చూపు వైఎస్సార్‌సీపీ వైపే..

Published Sat, Feb 3 2024 1:22 AM

- - Sakshi

చీపురుపల్లి(గరివిడి): జిల్లాలో అందరి చూపు వైఎస్సార్‌ సీపీవైపే. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తుండడంతో టీడీపీ శ్రేణులు పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నాయి. అర్హతే కొలమానంగా సంక్షేమ పథకాలు అందజేయడం, ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధికలగడం, జనబలం మెండుగా ఉండడంతో వైఎస్సార్‌సీపీలో చేరి ప్రజలకు సేవచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే కోవలో గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మన్నెపురి లక్ష్మణరావు ఆధ్వర్యంలో బద్రి పాపినాయుడు, మందాడి రాంబాబు, బద్రి లక్ష్మీనారాయణ, కిరాల రాము, పిసిని భవాని, బెల్లాన లక్ష్మిలకు చెందిన 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో శుక్రవారం చేరాయి. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి జెడ్పీ చైర్మన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల గుర్తుకొస్తారని, అనంతరం వారివైపు కన్నెత్తి కూడా చూడరని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కష్ట, సుఖాలను పంచుకోవడం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నైజమన్నారు. టీడీపీ నాయకులు ఈ రాష్ట్రానికి, జిల్లాకు, నియోజకవర్గానికి ఏం చేశారో ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో 600 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీను నెరవేర్చకుండా, మళ్లీ ఆరు గ్యారంటీలు పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనతో కొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల, భోగాపురం ఎయిర్‌పోర్టు, గిరిజన వర్సిటీ, గిరిజన ఇంజినీరింగ్‌, జేఎన్‌టీయూ వర్సిటీ మంజూరు చేసి ప్రజల చిరకాల కలను సీఎం సాకారం చేశారన్నారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌.వి.రమణరాజు, చీపురుపల్లి మండల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, వైస్‌ ఎంపీపీలు గుడివాడ శ్రీరాములునాయుడు, సర్పంచ్‌ తమ్మినాయుడు, బార్నాల సూర్యనారాయణ, శ్రావణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో జోరుగా చేరికలు

టీడీపీని వీడుతున్న శ్రేణులు

వైఎస్సార్‌సీపీలో చేరిన వెదుళ్లవలస టీడీపీ నాయకులు

పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన

జెడ్పీచైర్మన్‌, ఎంపీ

Advertisement

తప్పక చదవండి

Advertisement