● అక్కడే చదు‘వంట’..!
ఓ వైపు మధ్యాహ్న భోజన వంటలు.. మరోవైపు అదే వరండాలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న చిత్రం మెరకముడి దాం మండలం బుధరాయవలస జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోది. ఇక్కడ ఒకటి నుంచి పదో తరగతి వరకు 225 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదులతో పాటు లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్‌గది, ఆఫీ స్ కార్యాలయానికి మొత్తం 14 గదులు అవసరం. ఇక్కడ కేవలం 5 మాత్రమే ఉన్నాయి. దీంతో వరండాలు, కళావేదిక, చెట్ల నీడలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటు బోధనకు ఉపాధ్యాయులు, అటు అభ్యసనకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మరో 9 అదనపు తరగతి గదులు నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎంఈఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ పాఠశాలకు తరగతి గదుల లేమి విషయాన్ని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. – మెరకముడిదాం


