పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి | - | Sakshi
Sakshi News home page

పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి

Feb 25 2026 10:38 AM | Updated on Feb 25 2026 10:38 AM

పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి

పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం కావాలి

విజయనగరం కలెక్టరేట్‌: రీసర్వే త్వరగా పూర్తి చేయాలని, సర్వే ప్రక్రియలో పాల్గొనే డీటీలు, సర్వేయర్ల డిప్యుటేషన్లను వెంటనే రద్దు చేయాలని రెవెన్యూ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి నుంచి సీసీఎల్‌ఏ ముఖ్య కమిషనర్‌ జి.జయలక్ష్మితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం మాట్లాడారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందాలని, ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌లో సానుకూల ఫలితాలు వచ్చేలా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన గడువులోగా రీసర్వే, ఈకేవైసీ ప్రక్రియను శతశాతం పూర్తిచేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్య క్రమంలో జేసీ ఎస్‌.సేతుమాధవన్‌, డీఆర్వో మురళి, ఆర్డీఓలు పాల్గొన్నారు.

● జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో వివిధ శాఖల అఽఽధికారులతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తారకరామ తీర్థసాగర్‌, తోటపల్లి ప్రాజెక్టు, జాతీయ రహదారులు, మూడో రైల్వే లైన్‌, కొత్తవలస, విజయనగరం నాల్గవ రైల్వేలైన్‌, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తదితర ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement