ఉద్యోగోన్నతి పొందిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లు
విజయనగరం కలెక్టరేట్: జిల్లాలో తహసీల్దార్లుగా పనిచేస్తూ ఇటీవల కాలంలో డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగోన్నతి పొందిన పలువురు తహసీల్దార్లకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇటీవల ఆరుగురు తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించిన విష యం తెలిసిందే. ఇందులో లక్కవరపుకోట తహసీల్దార్‌గా పనిచేసిన కె.శ్రీనివాసరావును భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. డి–సెక్షన్ సూపరింటెండెంట్ పద్మావతి, గజపతినగరం తహసీల్దార్ రత్నకుమార్‌కు సీఆర్‌డీఏలో డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. సాలూరు తహసీల్దార్ నీలకంఠరావుకు పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేఆర్‌టీ డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇవ్వగా, కలెక్టరేట్‌లో ఈ–సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న టి.గోవిందకు విశాఖపట్నం డీజాస్టర్ మేనేజ్‌మెంట్ డీఎంగా పోస్టింగ్ ఇచ్చారు. మెంటాడ తహసీల్దార్ అరుణ్‌కుమార్‌కు జిల్లాలో పౌరసరఫరాల విజిలెన్స్ అధికారిగా నియమించారు.
మాటమార్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
● సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు
రామభద్రపురం/గజపతినగరం రూరల్: సమయాన్ని బట్టి.. అవసరం కొద్దీ మాట మార్చడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. రామభద్రపురం మండలంలోని ఆరికతోట, గజపతినగరం మండలంలోని దావాలపేట గ్రామంలో ఉన్న అగ్రిగోల్డ్ లేఅవుట్‌లను సీపీఐ బృందంతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాటం చేస్తున్నామని, ఆ పోరాటం ఫలితంగా 10 లక్షల43వేల మంది బాధితులకు న్యాయం జరిగిందన్నారు. ఇంకా 22 లక్షల మంది బాధితులకు న్యాయం జరగాల్సి ఉందన్నారు. జనాలను ముంచేసి అగ్రిగోల్డ్ యాజమాన్యం, అధికారులు కుబేరులయ్యారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడున్నర వేల కోట్ల రూపాయలు 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి అగ్రిగోల్డ్ వసూలు చేసిందని తెలిపారు. 20 వేల లోపు మొత్తం ఉన్న 10 లక్షల మంది ఖాతాదారులకు మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. మిగిలిన 20 లక్షల మంది బాధితులకు న్యాయం కోసం మార్చి 2 నుంచి పారాటం చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ నిలువునా ముంచేశారన్నారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఏ.వి.రాయుడు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిరుపతిరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆకేలమ్మ, ఆర్‌వీఎస్.కుమార్, నియోజకవర్గ కార్యదర్శి పురం అప్పారావు పాల్గొన్నారు.
నేర పరిశోధనలో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర కీలకం
● విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బగ్చీ
నెల్లిమర్ల రూరల్: శాసీ్త్రయ నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు కీలకపాత్ర పోషిస్తున్నారని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎస్.బగ్చీ అన్నారు. నెల్లిమర్ల మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నేడు సైబర్, ఆర్థిక నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాలను సేకరించడం, వాటిని భద్రపర్చడంలో ఫొరెన్సిక్ సైన్స్ నిపుణుల అవసరం ఎంతో ఉందన్నారు. రానున్న కాలంలో ఈ కోర్సు నేర్చుకున్నవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నా రు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ రవికుమార్, నాగజోగయ్య, ఆశిష్, సౌమ్య పాల్గొన్నారు.
ఉద్యోగోన్నతి పొందిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లు


