విజయనగరం అర్బన్: విద్యార్థులకు వర్తించే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సహాయం కోసం విద్యార్థులు, వారి తల్లుల పేరుతో సంయుక్త బ్యాంక్ ఖాతాలను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో ఎక్కడైనా తెరవొచ్చని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదివారం తెలిపారు. జీరో బేస్ట్ ఖాతాలను తెరిచేందుకు అన్ని బ్యాంకులు అంగీకరించాలని అందువల్ల విద్యార్థులు, వారి తల్లులు ఆయా బ్యాంకుల్లో ఏపీజీవీబీ, డీసీసీబీ సహా ఇతర బ్యాంకుల్లో ఎక్కడైనా తమ ఖాతాలను తెరచి పాస్‌బుక్ పొందవచ్చని పేర్కొన్నారు.
ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలు
సాలూరు: పార్వతీపురం మండలంలోని పుత్తూరుకు చెందిన బంగారుదొర, కృష్ణారావులు ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యేందుకు సాలూరు నుంచి మామిడిపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. వారిని మామిడిపల్లి నుంచి సాలూరు వస్తున్న ఆటో దత్తివలస సమీపంలో ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బంగారుదొర, కృష్ణారావులకు గాయాలవగా, సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు బంగారుదొర ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు.