సాక్షి, విశాఖపట్నం: భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజునే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు బాజీ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం కృష్ణ విమర్శించారు. గురువారం జిల్లా కోర్టు ఎదుట రాష్ట్ర పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం మేయర్ ఎన్నికల పోలింగ్‌కు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనరల్ ఏజెంట్‌గా వెళుతుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి, అనంతరం అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా బాజీ నాయుడు, కరణం కృష్ణ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకునే పరిస్థితి ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమన్నారు. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో అందుకు విరుద్ధమైన పాలన సాగుతోందని పేర్కొన్నారు. అందుకు స్థానిక ఎన్నికలే నిదర్శనమన్నారు. నామినేషన్లు వేయకుండా కూటమి నాయకులు దాడులకు దిగినా పోలీసులు వారికి సహకరించడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు.
ధర్మాన అరెస్టు అప్రజాస్వామికం
శ్రీకాకుళం మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరఫున జనరల్ ఏజెంట్‌గా వెళ్లేందుకు సంబంధిత రిటర్నింగ్ అధికారి అనుమతి పొందిన ధర్మాన ప్రసాదరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం, అనంతరం అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు రౌడీయిజం, రిగ్గింగ్‌కు పాల్పడి గెలిచాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచిన ఎన్నికలు చెల్లవని, దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో మరో రెండేళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి అధికారం ఉందన్నారు. రానున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కూటమి పాలన చివరి రోజుల్లోనైనా అధికారుల తీరు మారకపోతే భవిష్యత్తులో ఇందుకు సహకరించిన ఐఏఎస్, పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఊదా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.రవి, సూరిశెట్టి అనిల్, కార్యదర్శులు మొల్లి రామరావు, వాగుపల్లి చిన్నారావు, విశాఖ దక్షిణ నియోజకవర్గం లీగల్ సెల్ అధ్యక్షుడు లీలా కృష్ణ, గాజువాక నియోజకవర్గం లీగల్ సెల్ అధ్యక్షుడు గిల్బర్ట్, లీగల్ సెల్ ప్రతినిధులు గాలి రామిరెడ్డి, భానుప్రకాష్, బండారు గోపాలకృష్ణ, దాసు తదితరులు పాల్గొన్నారు.


