సిగ్నలింగ్‌ పనులు.. పలు రైళ్ల ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

సిగ్నలింగ్‌ పనులు.. పలు రైళ్ల ఆలస్యం

Nov 27 2026 12:56 AM | Updated on Nov 27 2026 12:56 AM

తాటిచెట్లపాలెం: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే బఖ్రాబాద్‌–డాంటన్‌ స్టేషన్ల మధ్య ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు, సిగ్నలింగ్‌ ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. దీంతో శుక్ర, శనివారాల్లో ఆయా రైళ్ల బయలుదేరే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలని రైల్వే సూచించారు.

నేడు ఆలస్యంగా బయలుదేరే రైళ్లు

● న్యూ జల్పాయిగురి–చైన్నె సెంట్రల్‌ (22612) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ – 3 గంటలు

● అగర్తల–చర్లపల్లి (17032) ఎక్స్‌ప్రెస్‌ – 2 గంటలు

● సికింద్రాబాద్‌–నహర్‌లగున్‌ (07046) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ – 3 గంటలు

● ఎస్‌ఎంవీటీ బెంగళూరు–హౌరా (12246) దురంతో ఎక్స్‌ప్రెస్‌ – 2.15 గంటలు

● ఎస్‌ఎంవీటీ బెంగళూరు–అగర్తల (12503) హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ – 2 గంటలు.

రేపు ఆలస్యంగా బయలుదేరే రైళ్లు

● హౌరా–ఎస్‌ఎంవీటీ బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌ – 3 గంటలు.

● షాలిమర్‌–చర్లపల్లి (18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ – 2 గంటల 30 నిమిషాలు.

● హౌరా–తిరుపతి (20889) హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ – 2 గంటలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement