గోపాలపట్నం: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగిలించిన నిందితుడిని ఒక్కరోజులోనే ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 13 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎయిర్‌పోర్టు క్రైమ్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ (క్రైమ్) ఎ.వెంకటరావు వివరాలు వెల్లడించారు. బుధవారం బాజీ జంక్షన్ సమీపంలో నివసిస్తున్న 62 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి వెళ్లిన నిందితుడు మేడపై హోర్డింగులకు ఫ్లెక్సీ ఫొటోలు తీసేందుకు వచ్చానని చెప్పి చెప్పాడు. అనంతరం మంచినీళ్లు అడిగాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగా వెంబడించి, తాడుతో మెడకు బిగించి 13 గ్రాముల బంగారు గొలుసును అపహరించి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు కొమ్మాది గ్రామానికి చెందిన చేబ్రోలు సతీష్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. సమావేశంలో వెస్ట్ క్రైమ్ డివిజన్ ఇన్స్పెక్టర్ బి.తిరుమలరావు, ఎయిర్‌పోర్టు ఎస్ఐ కె.రవికిశోర్ పాల్గొన్నారు.


