తట్టబందలో విషాద ఛాయలు | - | Sakshi
Sakshi News home page

తట్టబందలో విషాద ఛాయలు

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

రావికమతం: సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై ప్రమాదంలో లారీ డ్రైవరు మహాదేవ నాగ సూరి అప్పారావు(38) సజీవ దహనం కావడంతో రావికమతం మండలం తట్టబందలో మంగళవారం విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన నాగ సూరి అప్పారావు జంగాలపాలెంలో ఆర్‌.కె. స్టోన్‌ క్రషర్‌లో లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం లారీ లోడుతో పెందుర్తి వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఆగిన ట్రాలర్‌ లారీని ఢీకొనడంతో చెలరేగిన మంటల్లో సజీవ దహనమయ్యాడు. అతడది చోడవరం మండలం లక్కవరం కాగా, తట్టబందకు ఇల్లరికంగా వచ్చాడు. గ్రామానికి చెందిన శరకాన సత్తిబాబు, చింతల్లి కుమార్తె భవానీతో 16 ఏళ్లతో క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సూరి అప్పారావు మరణంతో అత్తమామలు, పిల్లలు, భార్య బోరున విలపిస్తున్నారు. అందరితో ఆప్యాయంగా ఉండే వ్యక్తి ఇక లేడని తెలుసుకుని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement