కార్తీక పౌర్ణమి వేడుకల్లో పుణ్యనదీ హారతి | - | Sakshi
Sakshi News home page

కార్తీక పౌర్ణమి వేడుకల్లో పుణ్యనదీ హారతి

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

సింహాచలం: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వరాహ పుష్కరిణి (కోనేరు) వద్ద పుణ్యనదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్కరిణి గట్టుపై దీపారాధనలు నిర్వహించారు.దేవస్థానానికి చెందిన కొండదిగువ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను శేషతల్పంపై ఊరేగింపుగా తీసుకొచ్చి వరాహ పుష్కరిణి వద్ద వేంచేప చేశారు. అనంతరం స్వామివారికి, పుష్కరిణికి ద్వయ హారతి, నక్షత్ర హారతి, అష్టహారతులు సమర్పించారు.

దేవస్థానం నిర్వహించిన సామూహిక దీపారాధనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు పుష్కరిణిలో దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఈవో దంపతులు, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ సతీమణి ప్రత్యూష, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement