మహారాణిపేట: జనాభా గణనకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని డీఆర్వో ఎస్‌డీ అనిత అన్నారు. సూర్యబాగ్‌లోని జీవీఎంసీ సౌత్ జోన్ సమావేశ మందిరంలో జనాభా గణనలో భాగంగా క్షేత్ర స్థాయి శిక్షకులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం రెండవ బ్యాచ్ ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. క్షేత్ర స్థాయిలో సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు సమగ్ర శిక్షణ అందించాలని ఆమె సూచించారు. డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ కార్యాలయం నుంచి జాయింట్ డైరెక్టర్ ఎస్.దయాసాగర్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.


